పటాన్చెరులో అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ, 12న దసరా పండుగ

politics Telangana

పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య పండుగలు నిర్వహించుకోవాలి..

ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను అక్టోబర్ 10 వ తేదీన, దసరా పండుగను అక్టోబర్ 12వ తేదీన నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శనివారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్దుల బతుకమ్మను అక్టోబర్ 10వ తేదీన పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై నిర్వహించుకోవాలని తెలిపారు.దసరా పండుగను అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ద్వజారోహన నిర్వహించి, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శమీ చెట్టుకు పూజలు నిర్వహించాలని నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మైత్రి మైదానంలో రావణాసురుడి దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీలు జైపాల్, మాణిక్యం, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, ప్రకాష్ రావు, ప్రతాప్ గౌడ్, పట్టణ పుర ప్రముఖులు, పురోహితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *