మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘గాడోలియనం-డోప్ చేయబడిన నికెల్ ఫెర్రైట్ నానోపార్టికల్స్ యొక్క లక్షణాలపై భస్మీకరణ ఉష్ణోగ్రత, కూర్పు యొక్క ప్రభావం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.పూర్ణచంద్రరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ భవానీ అధ్యయనం, సోల్-జెల్ ఆటో-దహన పద్ధతిని ఉపయోగించి జీడీ-డోప్డ్ నికెల్ ఫెర్రైట్ నానోపార్టికల్స్ యొక్క సంశ్లేషణ, లక్షణాలను అన్వేషించినట్టు తెలియజేశారు. వాటి నిర్మాణ, క్రియాత్మక లక్షణాలపై కాల్సినేషన్ ఉష్ణోగ్రత ప్రభావాన్ని పరిశీలించామన్నారు.ఈ పరిశోధన ఫలితాలు అధిక-ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్స్, మాగ్నెటిక్ పరికరాలు, ఈఎంఐ షీల్డింగ్, మైక్రోవేవ్ టెక్నాలజీలలో అనువర్తనాల కోసం ఈ నానోమెటీరియళ్ల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తాయని తెలిపారు.డాక్టర్ భవానీ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్: సమ్మక్క…
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మూడు కోట్ల 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 30…
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఎంటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న…
ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన డాక్టర్ అర్షియా సేథి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: చట్టాలను మనం గౌరవిస్తే, అవి మనకు…
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు.. అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 77 మీటర్ల జాతీయ జెండాతో…