ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్…
హైదరాబాద్:
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దావఖానాలలో బెడ్స్ కొరత ఏర్పడింది. బెడ్స్ కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
సుమారు 25 లక్షల విలువ చేసే రెండు వందల ఆక్సిజన్ సిలిండర్, ఫ్లూఇయిడ్స్ స్టాండ్ కలిగిన స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ ఎన్.వి.హనుమంత్ రెడ్డి తెలిపారు.
వీటిలో వంద బెడ్స్ ఉస్మానియా, వంద బెడ్స్ గాంధీ ఆసుపత్రికి అందజేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో దాతల సహకారంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్ట్రెక్చర్ బెడ్స్ అందజేస్తామన్నారు . కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్యకార్మికులు, స్వచ్చంధ సంస్థలు, మీడియా చేస్తున్న సేవలను ప్రశంసించారు.