మనవార్తలు ,పటాన్ చెరు :
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలిగి తీయడంతో పాటు విద్యార్థులు చదవడం , రాయడంలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో ‘ రూం టూ రీడ్ ‘ అనే స్వచ్చంద సంస్థ కృషి చేయడం అభినందనీయని భానూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు . బుధవారం భానూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ‘ రూం టూ రీడ్ ‘ లైబ్రరీ మేళ కార్యక్రమం నిర్వహించారు . ఇందులో విద్యార్థులు రూం టూ రీడ్ ‘ ద్వారా నేర్చుకున్న నాటికలు , స్టోరీటెల్లింగ్ ప్రదర్శించారు . ఈ సందర్భంగా రూం టూ రీడ్ ప్రతినిధి తేజస్వి విద్యార్థులకు రూం టూ రీడ్ ఏవిధంగా ఉపయోగ పడుతుందో గ్రామ సర్పంచ్ , కార్యదర్శి సంగీత , వార్డు సభ్యులు , ప్రజలకు వివరించారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత , ఉపాధ్యాయులు , రూం టూ రీడ్ సభ్యులు పాల్గొన్నారు .