Telangana

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగం చేస్తున్నామన్నడం కంటే ఆ ఉద్యోగంలో సఫలికృతుల మయ్యమనేదే ముఖ్యమని శశికళ యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలంలోని ముత్తంగి డివిజన్ లో గల పి ఎస్ ఆర్ గార్డెన్ లో గ్రామీణ నీటిపారుదల శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) డిప్యూటీ ఇంజనీర్( డిఈ) ఇంగు శ్రీనివాస్ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ రఘువీరా ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూసంగారెడ్డి జిల్లా లోని వివిధ ప్రాంతాలతో పాటు పటాన్ చెరు నియోజక వర్గ పరిధిలో నిర్వీరామంగా 1997 నుండి 2026 వరకు గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ నుండి డిప్యూటీ ఇంజనీర్ గా పదోన్నతులు పొంది మనసున్న అధికారిగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ అనేది చేయాల్సిందేనని కానీ పదవి విరమణ అనేది ఉద్యోగానికే తప్ప మనసుకు కాదని, మరో కొత్త జీవితంలోకి అడుగీడుతున్నట్లు భావించాలన్నారు. సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లా ఎస్ఈ రఘువీరా మాట్లాడుతూ మిషన్ భగీరథ ( గ్రామీణ త్రాగునీటి సరఫరా) విభాగంలో గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో వివిధ విభాగాలలో పదోన్నతులు పొందుతూ ఆ పదవికే వన్నెతెచ్చారని కొనియాడారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం మొదలుకొని డిప్యూటీ ఇంజనీర్ గా ఒక మచ్చలేని ఉద్యోగిగా పదవి విరమణ పొందుతుండడం అభినందనీయమని ఆయురారోగ్యాలతో మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఎస్ఈ రాజయ్య,ఈఈ లు పాషా, సంపత్, విజయలక్ష్మి, నాగభూషణం, డిప్యూటీ ఈఈ లు హరీష్, పాణి, రిటైర్డ్ ఈఈ లు రామకృష్ణ, రామ్మోహన్,సబ్ డివిజన్ల పలు విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago