Telangana

పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్:

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 6% శాతం నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గిరిజన శాఖామంత్రికి వినతి పత్రం సమర్పించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో గిరిజన శాఖ మంత్రి వర్యులు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన 10 శాతం రిజర్వేషన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి

నేడు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఎడల 10% రిజర్వేషన్ అమలు చేయకుంటే తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న 84 వేల ఉద్యోగాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా గిరిజన జీవితాలతో చెలగాటమాడుతుంది అందుకోసం టిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతు పోరాటం చేసిన విధంగా ఢిల్లీలో గిరిజన రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వాలని దానికి యావత్ గిరిజన ప్రజలు కదిలి వస్తారని అన్నారు .

మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి కెసిఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మియపూర్ పరిధిలోని నడిగడ్డ తాండాలో గత 40సం. నుంచి ఉంటున్న గిరిజనులు CRPF వారి ఎదుర్కొంటున్న సమస్యలను  తాను ఉన్నత స్థాయి అధికారుల మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్ మరియు మోహన్ సింగ్ నాయక్ ,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ,ఆంగోత్ హరి నాయక్ మరియు ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago