మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్ ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో జరగనుంది.హైదరాబాద్‌లో ఇంతకాలం తర్వాత షో ఎందుకు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్ సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ షో చేయాలనిపించిందని తెలిపారు. అలాగే ఈ కాన్సర్ట్ తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ అవుతుందని, ముఖ్యంగా ఆరంజ్ మూవీ, వాసు మరియు ఘర్షణ సినిమాల పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.ఈ కాన్సర్ట్ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, 13 సింగర్స్ తో పాటలు పాడబోయే గాయకులందరూ ఆ పాటల అసలు గాయకులే కావడం ఈ షోకు ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలిపారు. అలాగే ఇంత పెద్ద మరియు వైవిధ్యభరిత గాయకుల లైనప్ ఉండటంతో పాటల ఎంపికలో చాలా కష్టపడ్డామని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని జోరా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఇది అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించే కార్యక్రమంగా, హైదరాబాద్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సంగీత వేడుకగా నిలుస్తుందని తెలిపారు.

