_మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మూడు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు, మార్కెటింగ్ సౌకర్యం అందిస్తోందని తెలిపారు. ఈ సదవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు మత్స్య సహకార సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలతో మత్స్య సంపద అభివృద్ధి చెందడంతో పాటు మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మత్స్య శాఖ జిల్లా అధికారి సతీష్, నగేష్, నివర్తి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
