హెవీ వెహికల్ లైసెన్స్  విషయంలో నిబంధనలు సడలించండి_హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

politics Telangana

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

దాదాపు 07 సంవత్సరాల తర్వాత 27.07.2022 న TSPSC పెద్ద సంఖ్యలో రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI) ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరిసారి 2015 లో ఈ పోస్ట్ ల భర్తీ జరిగింది. నోటిఫికేషన్ ప్రకటించిన సమయానికి అభ్యర్థులు హెవీ వెహికల్ లైసెన్స్‌ కలిగి ఉండాలి అనే నిభందన చాలా మంది అభ్యర్థుల కి నిరాశ కలిగించింది. అయితే అభ్యర్థులు చాలా మంది గత 4, 5 నెలల నుండి లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ టెస్ట్ కోసం ఎదురుచుస్తున్నరు. అయితే హెవీ వెహికల్ లైసెన్స్‌ కోసం డ్రైవింగ్ స్కూల్ లో ఖచ్చితంగా నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే చాలా మంది అభ్యర్థులకి డ్రైవింగ్ స్కూల్ లో సీట్లు అందుబాటు లేకపోవడం వల్ల హెవీ వెహికల్ లైసెన్స్‌ పొందడానికి చాలా సమయం పడుతుంది.

కొందరు అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత రోజు తమ హెవీ వెహికల్ లైసెన్స్‌ పొందారు. అందుకోసం అభ్యర్థులు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండటానికి నోటిఫికేషన్ తేదీ ని పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకి సమయం ఇస్తే చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. గ్రూప్ 1, పోలిస్ అభ్యర్థుల విషయంలో నిబంధనలు సడలించినట్టు తమ విషయంలో కూడా హెవీ వెహికల్ లైసెన్స్ ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకి కలిగి ఉండేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

నోటిఫికేషన్ తేదీకి బదులుగా హెవీ వెహికల్ లైసెన్స్‌ని కలిగి ఉండే తేదీని పొడిగించమని లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయం వరకు HMV (రవాణా) లైసెన్స్‌ని కలిగి ఉండటానికి ఉండేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.ఫలితంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకి హాజరయ్యే అవకాశం లభిస్తుంది కాబట్టి ప్రభుత్వం  ఈ అంశం పై స్పందించి సడలింపులివ్వాలని మెట్టు శ్రీధర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *