Telangana

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం

8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే ప్రత్యేక మోటివేషన్ క్లాసులు పరీక్షా సామాగ్రి పంపిణీ 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి  అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్‌చెరు  జెపి కాలనీ డివిజన్లతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశం మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న 3000 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రయ్యచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంట్లో ఫోన్లు, టీవీలకు పిల్లలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం సొంత నిధులచే కొనుగోలు చేసిన పరీక్ష మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర రావు నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల హెడ్ మాస్టర్లు, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

27 minutes ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

31 minutes ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

22 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

24 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago