మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన ఆర్. కే .వై టీమ్ ద్వారా కావాల్సిన అత్యవసర వస్తువులను దగ్గరుండి వారికి సమకూర్చాలని టీమ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వారికి నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గణేష్ ముదిరాజ్. వినోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ జాజెరావు శ్రీను, జాజెరావు రాము, మల్లేష్, విజేందర్. గోపి తదితరులు పాల్గొన్నారు,