విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు…
పటాన్ చెరు:
గత మూడు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగిన నూతన అడ్మిషన్లపై మండల విద్యాధికారి రాథోడ్ ఆ సంస్థకు నోటీసు జారీ చేశారు.
సదరు నోటీసుకు విజ్ఞాన్ విద్యా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని శుక్రవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశానని ఎంఈఓ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాథోడ్ మాట్లాడుతూ…
పాఠశాల యాజమాన్యం పనితీరు మండల విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.
మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థుల వివరాలను ఇవ్వాలని ఆదేశించినట్టు గానే విజ్ఞాన్ విద్యా సంస్థకు కూడా తమ సిబ్బంది తెలియజేశారన్నారు. మండల పరిధిలోని ఇతర ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విధులు నిర్వహించినట్టు గాని, నూతన అడ్మిషన్లు జరిగిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేవలం విజ్ఞాన్ విద్యాసంస్థ మాత్రమే ఉపాధ్యాయులచేత విధులు నిర్వహింపజేస్తూ, నూతన అడ్మిషన్ సైతం తీసుకున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ సదరు విద్యాసంస్థ ఇచ్చిన వివరణ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగానే ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.