పటాన్‌చెరులో ఘనంగా రాములోరి కళ్యాణం

politics Telangana

రామనామ స్మరణతో మార్మోగిన పటాన్‌చెరు శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం

పట్టు వస్త్రాలు.. తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు..

అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ..

వేల సంఖ్యలో హాజరైన భక్తజనం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీరామ నవమి పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు వేద మంతురోచ్ఛారణల మధ్య అభిజిత్ లగ్నంలో జై శ్రీరామ్ నినాదాల హోరులో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ప్రతి ఏటా వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి సీతారాముల దర్శన భాగ్యం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *