మనవార్తలు ,పటాన్ చెరు
మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని చిట్కుల్ గ్రామంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఒకరి ఒకరిని ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు.ఈ రంజాన్ పండుగ అందరికీ మేలు, శుభాలు కలగజేయాలని అలాగే మైనార్టీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
ఈ కార్య క్రమంలో వార్డు సభ్యులు , క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, ముస్లిమ్ సోదరులు, అజ్జూ, కదిర్, జబ్బర్, అంజద్, ముజాయిట్, సికిందర్,ఎన్ఎమ్ యువసేన పాల్గోన్నారు.