మనవార్తలు , ఢిల్లీ :
దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా.. రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా(సీఈసీ) రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ కుమార్ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ మే 15న పదవీ బాధ్యతలు చేపడతారు. ఏడాది వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 1984 బ్యాచ్ ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్.. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.