శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్‌చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ రోడ్డులో మురళి కిరాణా యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి, రాజు, రామ్మోహన్ మల్లేష్, అజ్మత్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…