_సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు ముందుండాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కేజి నుండి పీ జీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు మండలం బానూరు గ్రామ పరిధిలోని కంచర్ల గూడెం లో 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధుల తో నిర్మించతలపెట్టిన ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణం కోసం లహరి రిసార్ట్స్ యజమాని హరిబాబు తొమ్మిది గుంటల స్థలాన్ని, నిర్మాణ ఖర్చును అందజేసేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. గ్రామీణ స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.