హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు..
హైదరాబాద్:
నగరంలోని బంజారాహిల్స్ నందినగర్‌లో మరోసారి ఆకతాయిలు రెచ్చిపోయారు. అకారణంగా ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వారి స్నేహితులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దుండగుల దాడిలో కొరియోగ్రాఫర్‌తో పాటు ఆర్ట్ డైరెక్టర్లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మంది దాడిలో పాల్గొన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా నందినగర్ గ్రౌండ్స్‌లో దారిన పోయేవారిపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.