మన వార్తలు ,పటాన్ చెరు:
ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం ఆయన అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు . ఒక ప్రతిపాదనకు సంక్షిప్త నేపథ్యం లేదా పరిచయం ఉండాలని , అమలు ప్రణాళిక , ఆశించిన ఫలితం , విశిష్టమైన కీలక ఐదారు పదాలను ఉటంకించాలని డాక్టర్ రాజు స్పష్టీకరించారు . ప్రాజెక్టు ప్రతిపాదన నిర్దిష్టంగా ఉండాలని , సాధారణ అంశాలను నివారించాలన్నారు .
మనదేశంలో పరిశోధనా నిధుల అవకాశాల గురించి , సమర్థవంతమైన పరిశోధన ప్రతిపాదనను ఎలా రూపొందించాలి , ప్రతిపాదనల సమర్పణ చిట్కాలు వంటి వాటి గురించి ఆయన వివరించారు . ఒక సమస్యకు తార్కిక పురోగతిలో కేంద్రీకృత పరిష్కారాన్ని అందించడం విజయవంతమైన మంజూరు ప్రతిపాదనగా అభివర్ణించారు . పరిశోధనా నిధులను సాధించాలంటే , వినూత్న ప్రతిపాదనలోని ప్రత్యేకమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలని , ఊహించిన విజయాలు , కొత్త పరికల్పనను తీసుకురావడం , లక్ష్యాల సాధన కోసం సమయపాలనను పేర్కొనడం వంటి కీలకమైన సాంకేతిక మెల్దురాళ్ల జాబితాను డాక్టర్ రాజు ఏకరువుపెట్టారు .
సెర్చ్ , డీఎస్టీ , డీబీటీ , డీఏఆర్ఆస్ఈ , ఐసీఏఆర్ , డీఏఈ , డీఆర్డీవోలతో సహా సీపీఆర్ఎస్ఐ , ఇస్రో , ఏఐసీటీఈ , సీఐఎస్ఆర్ , యూజీసీ వంటి పరిశోధనలకు నిధులను మంజూరు చేస్తున్న పలు ప్రభుత్వ సంస్థల జాబితాను ఆయన వివరించారు . తొలుత , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.శివప్రాద్ , ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అతిథిని స్వాగతించగా , డాక్టర్ పి . ఈశ్వరయ్య ఆయనను అధ్యాపకులకు పరిచయం చేశారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…