దేవతల గుట్టపై అన్య మతస్తుల దేవాలయాల నిర్మాణాలు అడ్డుకోండి

politics Telangana

_హుడా సెక్రటరీ కి వినతి పత్రం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ మున్సివల్ పరిధిలో హుడా స్థలాన్ని కాపాడాలంటు హుడా సెక్రటరీ చంద్రయ్యకు గురువారం స్థానిక బొల్లారం వాసులు వినతి పత్రన్ని అందచేశారు. మున్సిపల్ పరిధిలో చాలా స్థలం ప్రభుత్వానికి సంబందించిన హుడా సర్వే నెంబర్ లలో ఉందని చెప్పారు. సర్వే నెంబర్ 23, 42, 44, 233, 254, 268, 278, 280, 284, 15 లోని ప్రభుత్వానికి సంబందించిన హుడా స్థలంలో గత కొన్ని రోజుల నుండి అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారని అన్నారు. ఈ విషయంపై చాలా సార్లు అధికారులకు పిర్యాదు చేసిన అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్ళతో చేతులు కలిపి వాళ్లకు మద్దత్తుగా నిలబడి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది క్రైస్తవులు చర్చ్ నిర్మాణం చేపట్టారని,ఈ విషయంపై హుడా అధికారులకు పిర్యాదు చేయడంతో ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత జరిపారని, అయితే కూల్చివేత జరిపిన కొన్ని గంటలవ్యవధిలోనే కొంతమంది క్రైస్తవులు అక్కడ సిలువ ఏర్పాటు చేసారు. దేవుళ్ళ గుట్ట అంటే హిందూ దేవాలయలే నిర్మాణం చేపట్టాలని అన్య మతస్తులు దేవాలయలు అక్కడ నిర్మాణం చేపడితే రానున్న రోజుల్లో మతవిబేధాలు వస్తాయని,అది గొడవలకు దారి తీస్తుందని కావున అక్కడ చర్చ్ నిర్మాణం చేపట్టకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ ధర్మ ప్రసార కో కన్వీనర్ తెలంగాణ సుభాష్ చందర్, బీజేపీ సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, ఎస్సి ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం, బీజేపీ సీనియర్ నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు వెంకటయ్య, గోపీ, లాలప్ప, లాలయ్య, స్వామి, పండరి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *