_దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :
ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం వడకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి, హనుమాన్ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం జనకంపేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచులు లలిత మల్లేష్, పాండు యాదవ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…