ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా.. ప్రలోభాలకు గురి కావద్దు!

Hyderabad politics Telangana

మా మూవీ ఎలెక్షన్స్:

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (MAA) ప్రచారం రంజుగా సాగుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రకాష్ రాజ్ ఓ మాట అంటే, మంచు విష్ణు రెండు అంటున్నాడు. మంచు విష్ణు కామెంట్స్ కు వెంటనే ప్రకాష్ రాజ్ సమాధానం ఇస్తున్నాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. నిన్న మంగళవారం ప్రకాష్ రాజ్ మీడియా ముందుకొచ్చి దొంగనోట్ల ఆరోపణ చేస్తే.. మంచు విష్ణు అంతకు మించిన మాటలతో ప్రకాష్ రాజ్ వర్గానికి సమాధానమిచ్చాడు.

ప్రధాన అభ్యర్థులే.. ప్రత్యర్ధులై మాటల దాడికి దిగితే మిగతా సభ్యులు కూడా అదే దారిలో సోషల్ మీడియాలో ఫోకస్ చేసి ఎన్నికలఫై వేడి పెంచేస్తున్నారు. ఇక, ఈ రెండు ప్యానళ్లకి సపోర్ట్ చేసే మిగతా సెలబ్రిటీలు సైతం తల ఒక మాట సాయం చేసి ఎవరికి వారు వాళ్ళకి నచ్చిన వారికి ప్రచారం చేసి పెడుతున్నారు. ముందునుండే మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు అండగా ఉందని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ అంశంలో ఎక్కడా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు కానీ.. నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ వైపు బలంగా ఉన్నారు.

తాజాగా.. ఈ ఎన్నికలపై స్పందించిన నాగబాబు.. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ నిలబడతారని అసలు ఊహించలేదని.. ఒక సినిమాకి కోటి రూపాయలు తీసుకొనే ప్రకాష్ రాజ్ కోట్లు వదిలేసుకొని ఈ ఎన్నికల కోసం వస్తారని అనుకోలేదని.. అలాంటి వారిని కించపరుస్తారా అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ను తెలుగోడు కాదనే వాళ్ళు అసలు సినిమాకి అవసరమా అని నాగబాబు ప్రశ్నించారు. బాబు మోహన్ లాంటి వాళ్ళకి ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా అని నాగబాబు ప్రశ్నించారు. మా సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని నాగబాబు అన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *