నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు…
శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ లోని మక్తలో ఎస్సి బస్తీలో ఉన్న నీటి సమస్య గురించి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.మియాపూర్ బిజెపి డివిజన్ నాయకులు మక్త విలేజ్ లోని నీటి సమస్య గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు స్థానికంగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడానికి, బస్తీలో పైప్ లైన్ వేయడానికి గల మార్గం, కనెక్షన్ పాయింట్స్ ని చూసుకోవడం జరిగిందని బీజేపీ స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. నీటి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. బిజెపి నాయకులు అక్కడే ఉండి ప్రజలు పడే ఇబ్బందులు వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్స్పెక్టర్ జాజిరావ్ రమేష్, డివిజన్ అధ్యక్షుడు మానిక్ రావు, జనరల్ సెక్రటరీలు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణ , గుండె గణేష్ ముదిరాజ్, గంగారం మల్లేష్, రమేష్, విజేందర్, అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…