Telangana

ప్రణాళికాబద్ధంగా పటాన్ చెరు అభివృద్ది ఎమ్మెల్యే జిఎంఆర్

86 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్చెరు

పటాన్చెరువు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణం నుండి శాంతినగర్ కాలనీ లో 86 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నాడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పటాన్చెరు నేడు గేటెడ్ కమ్యూనిటీలకు ఐకాన్ గా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. శాంతి నగర్ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం పాత మార్కెట్ లో నిర్మిస్తున్న నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, శ్రీధర్ చారి, జిహెచ్ఎంసి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago