Telangana

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిబాపూలే  నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలె చిత్ర పటానికి నీలం మధు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహనీయుడు ఫూలే అన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, ఆశలకు అనుగుణంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దశాబ్దాలుగా ప్రజల న్యాయబద్ధ డిమాండ్ లైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago