పటాన్ చెరు:
గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 12 వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది . డాక్టర్ సుబ్బారావు తులసి , తన 74 వ యేట మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు . జీహెచ్ బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్ బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి , దాని ఫలితం ( ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన ) అనే అంశంపై ఆయన పీహెచ్డీని పూర్తిచేశారు . 1970 లో బీఈ ( మెకానికల్ ) పూర్తి చేశాక డాక్టర్ సుబ్బారావు రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి , అక్కడి బొకారో స్టీల్ ప్లాంలో 1983 వరకు పనిచేశారు .
తరువాత ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ లో చేరారు . 2007 లో ఐటీసీలో హెల్తర్ విభాగం ఉపాధ్యక్షుడిగా పదవీ విరమణ చేశారు . ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ( తెలుగు ) , గీతంలో ఎంబీఏ ( ఫైనాన్స్ ) లను పూర్తిచేశారు . 2012-14 వరకు హైదరాబాద్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో , 2015-16 వరకు గీతంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందించి దాదాపు నలభై ఏళ్ళ అనుభవాన్ని గడించారు .
