విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
ఎబీవీపీ వినతిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన స్కాలర్‌షిప్‌ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని పేర్కొన్నారు.పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతామని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు అశోక్, మేరాజ్ ఖాన్, చెన్నారెడ్డి, శ్రీకాంత్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్…
అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని…
గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…