పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్బహిస్తున్న సేవాకార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్ఎమ్అర్ యువసేన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి కి చెందిన విశ్వకర్మ సంఘం పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి నారాయణ చారీ ఎన్ఎంఅర్ యువసేన లో చేరారు. బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ఆయనను సాదరంగా యువసేనలోకి ఆహ్వానించారు,ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న ప్రజలకు తన వంతుగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్ఎంఅర్ యువసేన పని చేస్తుందన్నారు. ఎన్ఎంఅర్ యువసేన చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. మీరు ఇస్తున్న తోడ్పాటు అందరి మద్దతుతో భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి పని చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడలలలో నడుస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. భవిష్యత్తులో ఎన్ఎంఅర్ యువసేన పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. అనంతరం నారాయణ చారీ మాట్లాడుతూ ఎన్ ఎం అర్ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలు భేష్ అన్నారు. నీలం మధు నాయకత్వంలోని ఎన్ ఎం అర్ యువసేన లో పనిచేస్తూ ప్రజలకు తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి మధుసూదన్,పటిమేది పాండు,ch వెంకటేష్,సుభాష్,తదితరులు, పాల్గొన్నారు.