Districts

అట్టహాసంగా ప్రారంభమైన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలు..

మహిళల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ, మహిళా బందు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలు శనివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడామైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలె ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా క్రీడాకారులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళను గౌరవించుకోవాలి అన్న సమున్నత లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని 6, 7, 8 తేదీల్లో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రియాంక మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తాను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఏఎస్ అయ్యానని తెలిపారు.

తల్లిదండ్రులు లింగభేదం లేకుండా తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డినీ ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ లో పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని జట్టు రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ ఆధ్వర్యంలోని ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే జిఎంఆర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల మహిళా ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago