పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
మన దేశ చరిత్రలో వందేళ్లుగా గుర్తింపు ఉన్నవాడు చత్రపతి సాహు మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం ఆన్నారు.చత్రపతి సాహు మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర చత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ చత్రపతి శివాజీ వారసుడిగా కృషిచేసి ప్రజాస్వామిక తాత్విక పునాది ఏర్పరిచి ప్రజలకు రారాజుగా మిగిలిపోయిన మహనీయుడని వెనుకబడిన కులంలో పుట్టి సామాజిక ఉద్యమకారుడు అయ్యాడని కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహూ మహారాజ్ ఒక్కడే అని అన్నారు.ఛత్రపతి సాహు మహరాజ్ స్పూర్తితో బీసీలకు చట్ట సభల్లో 60 నుండి 70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే అని శ్రీశైలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి సంజీవ్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ,ప్రశాంత్, రమేష్, నర్సింహా,ఇస్నాపుర్ సెక్టార్ నాయకులు షేక్ ఫరీద్, జనార్ధన్, యేసు, తెల్లాపూర్ సెక్టార్, సునీల్ పాల్గొన్నారు.