కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ ఏపూరి శివానందం

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏ ఎమ్ సి ) చైర్మన్ ఏపూరి శివానందం తమ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.​తిరుమల క్షేత్రానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం గావించారు.​అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. పటాన్‌చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యేగా కాట శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారీ మెజార్టీతోటితో గెలవాలని కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని అన్నారు,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,రైతన్నలు సంతోషంగా ఉండాలని, పటాన్‌చెరు ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *