Telangana

కోకో క్రీడల సంబరానికి సిద్ధమైన పటాన్ చెరు

నేటి నుండి పటాన్ చెరులో 44వ తెలంగాణ అండర్ 14 కోకో బాలబాలికల అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్ చెరు పట్టణం మరోసారి వేదికగా నిలవనుంది. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మాదానం వేదికగా నేటి నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు 44వ తెలంగాణ అండర్ 14 ఖో ఖో బాల–బాలికల అంతర్‌ జిల్లాల చాంపియన్షిప్–2025 పోటీలు జరగనున్నాయి. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖో ఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రీడ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మైత్రి మైదానంలో క్రీడల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 33 జిల్లాల నుండి తరలివచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయంతో పాటు అల్పాహారం, భోజనం సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఏడాది పొడుపున వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు పటాన్ చెరు మైత్రి మైదానాని వేదికగా నిలుపుతున్నామని తెలిపారు. కోకో క్రీడకు మరింత ప్రాచుర్యం అందించేలా రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరి కిషన్, కార్యదర్శి శ్రీకాంత్, పటాన్ చెరు సిఐ వినాయక రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago