రాజునాయక్ హత్యకు భూ వివాదాలే కారణం _డీఎస్పీ భీంరెడ్డి
మనవార్తలు , పటాన్ చెరు
వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. భూ వివాదాలే కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. దారుణ హత్యకు గురైన రాజునాయక్ పెదనాన్న కుమారుడు రాంసింగ్ ఈ హత్యకు కీలకమని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల వెలమల తాండాలో కొంతమంది భూములను విక్రయించగా కోటి యాభై లక్షలు రావటంతో రాజునాయక్ తాను వాసులందరికీ కోటి రూపాయలు మాత్రమే ఇచ్చే యాభై లక్షలు తీసుకున్నాడు.
దీనిపై తాండ వాసులంతా రాజు నాయక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో రాజునాయక్ పెదనాన్నకు చెందిన 32 గుంటల భూమిని అమ్మాలని పెదనాన్న కుమారుడు రాంసింగ్ పై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై తీవ్ర బెదిరింపులకు కూడా పాల్పడటంతో రామ్ సింగ్ రాజునాయక్ హత్యకు తెరదీశాడు. కంది మండలం కౌలం పేటకు చెందిన రమేష్ విష్ణులతో రాజు నాయక్‌ను హత్య చేయడానికి పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగా లక్షా యాభై వేలు ఫోన్‌పే ద్వారా నిందితులకు అందించాడు.ప్రకాశం జిల్లాకు చెంది సంగారెడ్డిలో నివాసముంటూ గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడైన మాధవ్ ను కలుపుకున్న రమేష్ విష్ణులో పకడ్బందీగా రాజును పిలిపించి గొడ్డలితో నరికి హత్య చేశారు. అనంతరం రాజు వాహనంలోనే మృతదేహాన్ని తరలించి మార్గమధ్యలో తలను వేరు చేసి కుష్నర్ గ్రామ సమీపంలో ఓ వాగులో తలను పడేసి మొండాన్ని మంజీర బ్యారక్లోపడేశారు. వీరికి సహకరించిన వెంకటేశ్ మల్లేష్ బాలు లను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.