​సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం  శుభపరిణామం – యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

Districts politics Telangana

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి:

సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్   స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్‌పై గతంలో ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కి, ఈ అంశంపై చొరవ తీసుకున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని కి యువజన సంఘాల సమితి తరఫున మెట్టుశ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటైతే జిల్లాలోని విద్యార్థులు, విదేశాలకు వెళ్లే యువత, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే పాస్‌పోర్ట్ సేవలు పొందే అవకాశం కలుగుతుందని మెట్టు శ్రీధర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *