గీతం అధ్యాపకుడు బుర్రా భాస్కర్ కు డాక్టరేట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ‘నాన్-సర్క్యులర్ జర్నల్ బేరింగ్ పనితీరుపై ఉపరితల ఆకృతి ప్రభావం’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బుర్రా భాస్కర్ ను డాక్టరేట్ వరించింది.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రమేష్ బాబు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. […]

Continue Reading

కెసిఆర్ అందించిన గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి

_కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ గుమ్మడిదల, మనవార్తలు ప్రతినిధి : రాష్ట్రంలోని ఆడపిల్లల పెళ్లి నిరుపేద కుటుంబాలకు భారం కావద్దన్న సమున్నత లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన ఏడు లక్షల రూపాయల విలువైన చెక్కులను సాయంత్రం క్యాంపు కార్యాలయంలో […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘాకు భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (సెర్చ్) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఛత్తీస్ గడ్ లోని రాయ్పూర్ జిల్లాలో కృత్రిము మేథ/మెషీన్ లెర్నింగ్ ఆధారంగా భూగర్భ జలాల గుణాత్మక, పరిమాణాత్మక మూల్యాంకనం ప్రాజెక్టును, రూ.32.03 లక్షల గ్రాంట్తో […]

Continue Reading

ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత

– పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి – బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల […]

Continue Reading

క్రికెట్ విజేతలకు బహుమతుల అందజేత

రేగోడ్, మనవార్తలు ప్రతినిధి : యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, క్రీడల వైపు ద్రుష్టి సారించాలని ప్రముఖ జర్నలిస్ట్ తెనుగు నర్సింలు అన్నారు. వివేకానంద జయంతి సందర్బంగా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామం లో నిర్వహించిన క్రికెట్ టౌర్న మెంట్ విజేతలకు అనూష చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. మర్పల్లి యువత క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శిస్తు, మంచి స్నేహ పూర్వక వాతావరణం లో క్రిడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాతి సెలవు రోజుల్లో యువత మొత్తం […]

Continue Reading

భ్రుంగి వాహనం పై విహరించిన భోళా శంకరుడు

_శ్రీగిరి లో వైభవంగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు _భృంగీ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన ఆదిదంపతులు శ్రీశైలం,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రమణ పుణ్యకాలం ను పురస్కరించుకొని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహా క్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి శనివారం సాయంత్రం మేళతాళాలతో,మంగళ వాయిద్యాల నడుమ భృంగి వాహనంపై విహరించారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల […]

Continue Reading

క్రీడల ద్వారా స్నేహపూర్వక వాతావరణం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం.. పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ […]

Continue Reading

ముత్తంగి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు మాజీ జడ్పీటిసి బిఅర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బోగీ, సంక్రాంతి […]

Continue Reading

గీతం స్కాలర్ వసుధకు పీహెచ్ఎడీ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ‘హైదరాబాద్ (తెలంగాణ)లోని ఐటీ సంస్థలలో సంస్థ యొక్క సుస్థిరతపై పర్యావరణ హిత మానవ వనరుల నిర్వహణ (జీహెచ్ఆర్ఎం) అభ్యాసాల ప్రభావం’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వసుధను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.పార్వతి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading

శిల్పా కళా వేదికలో ఘనంగా లొహ్రి వేడుక

– తెలంగాణ పంజాబి సభ మరియు మెఫిల్ ఇ సర్తాజ్ అధ్వర్యంలో లోహ్రి సంబరాలు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పంజాబ్ లో జరిగే లోహరి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉండే పంజాబీలు హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో లోహ్రి వేడుకలో పాల్గొన్నారు పంజాబి మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తేజ్ దీప్ కౌర్, రవీందర్ సింగ్ సర్ణ, ప్రెసిడెంట్ తెలంగాణ పంజాబి సభ , ప్రేమ్ కుమార్ కపూర్, […]

Continue Reading