– బండ్లగూడ జాగిర్ లోని వాంటేజ్ మాల్ లో.
– ప్రారంభోత్సవ ఆఫర్ కింద బై టు గెట్ వన్ ఫ్రీ
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ తమ 36వ స్టోర్ హైదరాబాద్ నగరంలో బండ్లగూడ జాగిర్ లోని వాంటేజ్ మాల్లో గురువారం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఇది 75వ స్టోర్‌గా పేరుగాంచింది. సువిశాలమైన విస్తీర్ణంగల ఈ నూతన మ్యాక్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ హైదరాబాద్ ఫ్యాషన్ వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా ఉంది. అన్నివర్గాల వారికి అందుబాటులో ధరలు ఉండటం విశేషం. వినియోగదారులు తాము చెల్లించిన ధరకు తగిన నాణ్యమైన దుస్తులను మ్యాక్స్ స్టోర్లలో పొందొచ్చు. కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం, విలక్షణమైన, ప్రత్యేక గొప్ప షాపింగ్ అనుభవం కోసం మ్యాక్స్ స్టోర్‌ను సందర్శించవచ్చు. ప్రత్యేకమైన ప్రారంభోత్సవ ఆఫర్ కింద మూడు రోజులపాటు ప్రతి ఒక్కరికీ రెండు కొంటే ఒకటి ఉచితం (బీ2జీ1). అంతేకాకుండా అతి తక్కువ ధర రూ.149 నుండి ఫ్యాషన్ దుస్తులును అందిస్తున్నదని మ్యాక్స్ ఫ్యాషన్ యాజమాన్యం తెలియజేసింది. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే మ్యాక్స్ స్టోర్‌ని సందర్శించండి.