politics

రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలి – సీపీఐ

_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ

మనవార్తలు ,నంద్యాల:

నంద్యాల జిల్లా బన‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయ‌ప‌డిన వారికి 25 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు కె.రామాంజ‌నేయులు ,సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ఎన్ .రంగ‌నాయుడులు డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ‌స్తున్నార‌ని త్వరగా పనులు పూర్తి చేయాలని కార్మికులపై ఎక్కువ పని భారంమోప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌న్నారు . ప్రమాదం జరగడానికి కారకులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .

మరణించిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు, ప్రమాదంలో గాయపడిన ప్రతి కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నంద్యాల జిల్లాలో ని సిమెంట్ ఫ్యాక్టరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో కూడా గడివేముల ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటన జరిగిన ఫ్యాక్టరీ యజమాన్యం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేద‌ని గుర్తు చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కార్మికుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు .

గతంలో పాలిమర్స్ కంపెనీలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ఇచ్చారని వారు గుర్తు చేశారు . మృతి చెందిన ప్రతి కార్మికుల కుటుంబానికి ఇచ్చి ఆదుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ‌ని హెచ్చ‌రించారు. బాధిత‌ కుటుంబాలకు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago