అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన ఓల్డ్ ఎం ఐ జి

Hyderabad politics Telangana

_కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

ఎట్టి పరిస్థితులోను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదే లేదంటూ ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చింది. ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ కిందిస్థాయి అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భేల్ ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ ఇష్టాను తీరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ తోటి ప్రభుత్వ అధికారులకు సహకరించకపోతే ఇక బయటవాళ్ళు ఎలా సహకరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భేల్ పాత ఎం ఐ జి కాలని ఇటు శేరిలింగంపల్లి, అటు ఆర్.సి పురం రెండు సర్కిళ్ల మద్ధ్యలో ఉంది. కొంతభాగం ఇటు మరి కొంత భాగం అటు వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మేనవేశాలు లెక్కించడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే కొందరు రాజకీయ నాయకులు వీరికి అండగా ఉండడం అక్రెమార్కులకు కల్సివస్తుంది. ఎమ్మెల్యే నో, కార్పొరేటరో, లేక మరో లీఫర్లొ ఇలా వారి పేర్లు చెప్పుకొని తమపని చక్కబెట్టుకుంటున్నారు. ఎం ఐ జి ప్లాట్ నెంబర్ 929, 643 ఎదురుగా, 642 పక్కన, 214 మరియు 204 మధ్యలో ఒకటి, 446, 469 ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. వీటిపై తక్షణమే చర్యలు చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *