సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు నిండు కుండల మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 11వ నెంబర్ గేటు ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ముందుగా గంగా పూజ చేసి తదనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు లోకి మరో 33వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు సూచించారు. ప్రతి ఎకరాకు నీళ్ళందించదమే కేసీఆర్ కల అని ఎమ్మెల్యే క్రాంతికిరన్ అన్నారు.