మనవార్తలు , పటాన్ చెరు:
చిట్కుల్ గ్రామం ఒక మోడల్ పంచాయితీ గ్రామం రాష్ట్రాని అంతటికి చిట్కుల్ ఒక ఆదర్శ గ్రామం ,ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి స్థాయిలో ప్రతి ఒక్కరి కృషి ఉందని చిట్కుల్ సర్పంచ్ నీలంముదిరాజ్ అన్నారు దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామసీమలు అభివృద్దితోనే దేశ అభివృద్ది సాధ్యమవుతుందని ఎన్డీటీవీ కరస్పాండెంట్ ఉమ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంను మంగళవారం రోజున ఉమ సందర్శించారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు , ప్రకృతివనం ,గ్రామ అభివృద్ది చెందిన తీరును చిట్కూల్ సర్పంచ్ నీలం ముదిరాజ్ ను అడిగి తెలుసుకున్నారు.చిట్కుల్ గ్రామ ముఖద్వారం , డంపుయార్డును ,శివుని గుట్ట, స్మశాన వాటిక, బృహత్ పల్లె, ప్రకృతి వనం.అన్నింటినీ షూట్ చేసి అనంతరం సర్పంచ్ నీలంముదిరాజ్ ను ఇంటర్వ్యూ చేశారు.