రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాలు

politics Telangana

మొదటిరోజు త్రిపుర బాలసుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండ గ్రామంలో రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ పెద్దలు అంతిరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, మరియు యువత ఆధ్వర్యంలో విజయదశమి దుర్గామాత నవరాత్రుల అమ్మవారి పూజలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ కుశంగల ప్రమీల, గ్రామ పెద్దలు విచ్చేసి దుర్గామాత పూజలో పాల్గొన్నారు, అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ విజయదశమి నవరాత్రులలో భాగంగా దుర్గామాతను ప్రతిష్టించి రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మ వాళ్ళ రూపాలలో మొదటి రూపంగా త్రిపుర బాలసుందరిగా భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకున్నారు, తొమ్మిది రోజులు ప్రతిరోజు అన్నప్రసాదవితరణ కార్యక్రమని నిర్వహిస్తాము, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు, 25 మంది భక్తులు అమ్మ దీక్ష తీసుకోవడం జరిగిందని తెలిపారు,అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే రామేశ్వరం బండ గ్రామ ప్రజలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ఉండాలని అమ్మవారికి మొక్కమని అన్నారు..ఈ కార్యక్రమంలో , 7 వ వార్డు కౌన్సిలర్ రమేష్ ,9వ వార్డ్ కౌన్సిలర్ రమేష్,బాలరాజు గౌడ్,జీవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ,గడ్డమీది ప్రశాంత్ ముదిరాజ్,లోకేష్, నగేష్, దశరథ్, రామేశ్వరం బండ గ్రామ పెద్దలు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *