_నూతన క్యాలెండర్ ఆవిష్కణలో యోగానంద్
శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
ప్రజా సమస్యలు వెలికితీయడంలో నవతెలంగాణ దినపత్రిక ఎప్పుడు ముందుతుందుoటుoతుంది బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. నవతెలంగాణ 2023 నూతన క్యాలెండర్ ను సోమవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గలో కె పి హెచ్ బి లోని మాంజీరా మాల్ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని, ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా సమస్యలు వెలికితీయడంతో పాటు నిజా నిజాలను వెలికితీయడంలో ముందుంటుందని, అదేపంథాను కొనసాగించాలని సూచించారు. కార్పొరేట్ పత్రికలకు ధీటుగా నిలబడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ ప్రజల పక్షాన నిలబడుతున్న నవతెలంగాణ యాజమాన్యానికి ఎప్పుడు మా వంతు సహాయ సాకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ సోమిశెట్టీ, కే జితేందర్, రత్న కుమార్, రాజు రజక, సత్య కుర్మా, లక్ష్మి అన్నపూర్ణ, దీప్తి, హేమంత్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.