జ్యోతి విద్యాలయoలో నేషనల్ వాలి బాల్ పోటీలు ప్రారంభం

Hyderabad Telangana

_వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

భారత్ హెవీ ఎలక్రీకల్ లిమిటెడ్ (భెల్) స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ అధ్యక్షుడు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారం తో భెల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ మరియు జ్యోతి విద్యార్థులయ హై స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్ అండ్ క్లబ్ వాలీబాల్ పోటీలు బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. భెల్ జి.ఎం బి.శ్రీనివాస్, డి.జి.ఎం. ప్రసాద్, వాలీబాల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణ ప్రసాద్ లు ముఖ్యఅతిదులుగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 80 టీములు ఇందులో పాల్గొన్నాయి. ఇంటర్ స్కూల్ బాయస్ అండ్ గల్స్, ఇంటర్ కాలేజ్ అండ్ క్లబ్ ( ఉమెన్) విభాగాల్లో పోటీలు నాలుగు రోజుల పాటు జరుగనున్నాయి.

ఇందుకు గాను భెల్ ఎంప్లాయిస్, వాలీబాల్ అసోసియేషన్, జ్యోతి విద్యార్థులయ పూర్వ విద్యార్థులు, సీనియర్ వాలీబాల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పూర్తి సహాయసాకారాలు అందజేస్తున్నారు. వాలీబాల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి స్మారక టోర్నమెంట్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని, ఈ సారి భెల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్కూల్ పిన్సిపాల్ ఉమామహేశ్వరి తెలిపారు. ఇందుకు సహాయసాకారాలు అందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పూర్వ విద్యార్థులకు, స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరవ రామకృష్ణ, కిషోర్ గంజి,మంజీత్ రెడ్డి, రామకృష్ణo రాజు, స్కూల్ పి ఈ టి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *