Categories: politics

నా ఎదుగుదల సర్వేలు గురుకులం భిక్షే_గురుకుల స్వర్ణోత్సవాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి

మన వార్తలు,సంస్థాన్‌నారాయణపురం:  

నా ఎదుగుదలకు సర్వేల్‌ గురుకులం చదువే కారణం.నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు నిర్వహించారు.జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.సర్వేల్‌ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago