బెంగళూరు:
దసరా నవరాత్రుల నేపథ్యంలో ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.చనిపోయిన ఆమె భర్త ఈ హిందూ ఆలయాన్ని కట్టించడం మరో విశేషం.కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్ సిటీలో ఈ ఘటన జరిగింది.రైల్వే ఉద్యోగి అయిన తన భర్త 50 ఏండ్ల కిందట భగవతి అమ్మ దేవాలయాన్ని నిర్మించి హిందూ సమాజానికి అప్పగించారని ముస్లిం మహిళ ఫమీదా తెలిపారు.ఈ నేపథ్యంలో దసరాను పురస్కరించుకుని మరణించిన తన భర్త నిర్మించిన ఆలయంలో అమ్మవారికి పూజలు చేసినట్లు ఆమె చెప్పారు.