ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత

politics Telangana

– పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

– బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కులమతాలకతీతంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 170 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు ఎం.డీ ఆబేద్ మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగుల్లో పోటీల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి వాషింగ్ మిషన్, రెండవ బహుమతి గ్రైండర్, మూడవ బహుమతి మిక్సీ, నాలుగవ బహుమతి ఎలక్ట్రిక్ కుక్కర్, లతోపాటు 170 మందికి కన్సోలేషన్ బహుమతులు ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, మాజీ జెడ్పిటిసి గడీల శ్రీకాంత్ గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేరజ్ ఖాన్, సందీప్, రామకృష్ణ, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *