Telangana

సామూహిక స్ఫూర్తిని నింపిన ముదిత 3.0

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం వార్షిక ఆనందం, శ్రేయస్సుల వేడుక ‘ముదిత 3.0’ సామూహిక స్ఫూర్తిని చాటింది. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఆతిథ్య విభాగం బుధవారం ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, సహాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన, దీర్ఘకాలిక సేవ, గుర్తింపుకు నోచుకోని వారి సేవలను గుర్తించి, వెలుగులోకి తెచ్చి, వారిని అవార్డులతో సత్కరించడంతో పాటు ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనల మేళవింపుగా సాగింది. గత ఏడాదిగా చేపట్టిన కీలకమైన మైలురాళ్ళు, విజయాలను వార్షిక నివేదికలో ఏకరువు పెట్టారు. ఆడియో విజువల్ (ఏవీ), క్యాట్స్, ప్రాజెక్టులు, ఆర్థిక, భద్రత తదితర ఇతర విభాగాలు వేడుకను సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయి.

వేడుకలకు మించి, అన్ని విభాగాల మధ్య సహాయ సహకారాల ప్రాముఖ్యతను ముదిత 3.0 గుర్తుచేసింది. ఆయా విభాగాల లక్ష్యాలు, విలువలు, సేవా స్ఫూర్తిని పంచుకోవడం ద్వారా సమన్వయంతో పనిచేసినప్పుడు, అవి గీతం దార్శనికతకు జీవం పోస్తాయన్నారు. నిజాయితీ, కరుణ సంస్కృతిపై ముందుకు సాగే అసాధారణమైన జ్జాన ఆధారిత సంస్థగా మార్పు తీసుకురావడం తమ లక్ష్యంగా వారు పేర్కొన్నారు.ముదిత ద్వారా, గీతం దాని విజయాలను మాత్రమే కాకుండా, సహకార సంస్కృతిని, దాని పురోగతిని నడిపించే భాగస్వామ్య ఉద్దేశ్యాన్ని కూడా వేడుకగా జరుపుకుంటుందని తెలిపారు. విశ్వవిద్యాలయం నిరంతర వృద్ధికి దోహదపడే ప్రతి వ్యక్తి యొక్క ఐక్యత, అంకితభావాల ప్రాధాన్యతను ఈ కార్యక్రమం చాటి చెప్పింది.

ఈ కార్యక్రమంలో హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం, క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, దానిని కొనసాగించాలని సూచించారు. అత్యుత్తంగా సేవలందించిన సిబ్బందికి అవార్డులను ఇచ్చి సత్కరించారు.ముదిత, కేవలం విజయాల వేడుకగా మాత్రమే కాకుండా, గీతంను ముందుకు నడిపించే ఐక్యత, స్థితిస్థాపకత, భాగస్వామ్య లక్ష్యం యొక్క వేడుకగా ఓ శాశ్వత ముద్రను మిగిల్చింది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago