దుర్గామాత సేవలో పర్స శ్యామ్ రావు దంపతులు

politics Telangana

ఉస్మాన్ నగర్‌లో విగ్రహం విరాళం.. న్యూ ఎంఐజీలో ముక్కుపుడక సమర్పణ..

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: పర్స శ్యామ్ రావు

తెల్లాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :

సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ 263, ఉస్మాన్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో ఆదివారం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత తొలి పూజ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే తన వంతు సహాయంగా దుర్గామాత విగ్రహాన్ని విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారతి నగర్ డివిజన్ న్యూ ఎంఐజీ, రోడ్డు నంబర్ 18లో నిర్వహించిన దుర్గామాత తొలి రోజు పూజా కార్యక్రమంలోనూ పర్స శ్యామ్ రావు దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లేపాగా సురేందర్ ఆహ్వానం మేరకు విచ్చేసిన వారు దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ముక్కుపుడకను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *