చిట్కుల్లో ఘనంగా దుర్గమ్మ జాతర
పాల్గొన్న నాగర్కర్నూల్ జిల్లా జడ్జి శ్రీనిధి
పలు ఫలారం బండి ఊరేగింపులను ప్రారంభించిన నీలం
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, దయ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన బుధవారం శ్రీ దుర్గాదేవి ఆలయంలో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక మొక్కుబడులు చెల్లించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ వేడుకలకు చిట్కుల్ వాసి దశరథ్ దత్త గారి సతీమణి నాగర్కర్నూల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్, కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి శ్రీనిధి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.దేవాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు జడ్జి శ్రీనిధి గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో బోనాల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫలారం బండి ఊరేగింపులను ప్రారంభించిన నీలం, పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల జయ జయధ్వానాలు మిన్నంటాయి.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు , ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

