అన్ని కులాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మన వార్తలు ,పటాన్ చెరు
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో ఇటీవల కోటీ 20 లక్షల 50 వేల రూపాయల సి ఎస్ ఆర్, జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ ల సౌజన్యంతో ఆధునిక హంగులతో ఆధునీకరించారు. బుధవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధి కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశ్రిత పక్షపాతం లేకుండా అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో ఆయా కుల సంఘాల కోసం కమ్యూనిటీ హల్లు, కళ్యాణ మండపాలు సైతం నిర్మించినట్లు తెలిపారు. అందరికోసం అతి తక్కువ ఖర్చుతో వివాహాలు నిర్వహించుకునేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నివర్తి దేవ్, తులసి దాస్, ఎట్టయ్య, రాము, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…